చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచార కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి జీ చిన్నారెడ్డి విజయం కోసం కృషి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే రాజీనామా చేస్తే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఇప్పటి వరకు ఆగినట్లు తెలుస్తోంది. ఆదివారం ఎమ్మెల్సీ పోలింగ్ ముగియడంతో.. రాజీనామా […]
విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదంపై ఊరట..!
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటీకరణ చేయబోతున్న అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం అభ్యంతరం తెలుపుతూ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటానికి పలు రాజకీయ పార్టీల నేతలు మద్దతు ఇచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కీలక వ్యాఖ్యలు […]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన హోంమంత్రి, ఎమ్మెల్యే
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ను టీఆర్ఎస్ నేతలు ఉల్లంఘించారు. ఆదివారం పట్టభద్రుల ఎన్నికల జరుగుతున్న వేళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారు. దేశానికి పీవీ నరసింహారావు చేసిన సేవలను గుర్తించుకుని టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణి దేవికి ఓటు వేయాలని పోలింగ్ బూత్ దగ్గర నాగేందర్ సూచించారు. జంబో బ్యాలెట్ లో నాలుగో నెంబర్ మీద ఒకటే ఒక గీత గీసి బంగారు తెలంగాణకు తోడ్పడాలని గ్రాడ్యుయేట్స్ అందర్నీ కోరుతున్నట్లు మీడియా […]
తెలుగువారిపై గురిపెట్టిన భారతీయుడు.!
తమిళనాడు వేడెక్కుతుంది.. ఎండాకాలమనే కాదు.. రాజకీయాలతో వేడెక్కుతుంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. కొత్తగా వచ్చిన కమల్ హాసన్ పార్టీ కూడా అదే పనిలో నిమగ్నమైంది. అసలు కమల్ హాసన్ ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది కూడా ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి సినీ నటుడు కమల హాసన్‌కు చెందిన మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) వర్గాలు పలు వివరాలు తెలిపాయి. తమ […]
75వ స్వాతంత్య్ర దినోత్సవ కమిటీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు
75వ స్వాతంత్య్ర దినోత్సవం కోసం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఏర్పాటైన జాతీయ కమిటీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చోటు దక్కింది. మొత్తం 259 మంది ఉన్న ఈ కమిటీలో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే, అజిత్ ధోవల్, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సీనీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలూ ఉన్నారు. సినీ రంగం నుంచి […]
కేసీఆర్ కు బండి సూటి ప్రశ్న: హరికృష్ణ కో న్యాయం..? పీవీ కో న్యాయమా..?
కూకట్ పల్లి ఉప ఎన్నికలో హరికృష్ణ కూతుర్ని టీడీపీ ఎన్నికల్లో నిలబెడితే.. లోకేశ్ కు ఇచ్చినట్లు మంత్రి పదవి ఇవ్వకుండా ఓడిపోయే చోట నిలబెట్టావంటూ చంద్రబాబును కేసీఆర్ విమర్శించారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ గుర్తుచేశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా పీవీ కుమార్తెకు ఓడిపోయే సీటు ఇచ్చి నిలబెట్టారు..అంటే హరికృష్ణ కో న్యాయం..? పీవీకో న్యాయమా..? అంటూ బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు. పీవీ కుమార్తెను ఎమ్మెల్సీ చేయాలంటే గవర్నర్ కోటాలో ఇవ్వోచ్చు.. లేకపోతే నేరుగా […]
ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మొదలైన టెన్షన్
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలే గెలిపించాలని ఇటీవల కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోలాగా కాకుండా కష్టపడి పనిచేయాలని గులాబీ నేతలకు కేటీఆర్ హుకుం జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యేలు కలవరపడుతున్నారట. ఎమ్మెల్సీ ఓటరు లిస్టులు వేతికే పనిలో టీఆర్ఎస్ శాసనసభ్యులు నిమగ్నమయ్యారు. సర్కార్ కొలువులు రాక చాలా మంది పట్టభద్రులు నిరాశతో ఉన్నారు. జాబ్స్ నోటిఫికేషన్లు లేకపోవడంతో ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అటువంటి […]
కొత్తగా వచ్చే ఓటర్లపై గురిపెట్టిన వైఎస్ షర్మిల
కొత్తగా ఓటు హక్యు పొందే యువతీ,యువకులపై వైఎస్ షర్మిల దృష్టి సారించారు. తాను పెట్టబోయే పార్టీకి సర్వశక్తులూ సమకూర్చేపనిలో ఆమె నిమగ్నమయ్యారు. తెలంగాణలో జిల్లాల వారీగా నాయకులతో బిజీబిజీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలువురు నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆమెను కలిసి మద్దతు తెలిపారు. షర్మిల లోటస్ పాండ్ లో బుధవారం పలు యూనివర్సిటీ స్టూడెంట్స్ తో ముఖాముఖి నిర్వహించారు. దాదాపు 350 మంది విద్యార్ధులతో షర్మిల ముచ్చటించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి […]
అన్న బాణం.. జై తెలంగాణ అంటున్నది
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పలుమార్లు బహిరంగసభలో ఊదరగొట్టిన వైఎస్ షర్మిల.. నేడు జై తెలంగాణ అంటూ సరికొత్త రాగాన్ని అందుకున్నారు. తెలంగాణలో జగనన్న రాజ్యం స్థాపిస్తాను.. అందుకే పార్టీ పెడుతున్నాను అంటూ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ ఏర్పాట్లపై షర్మిల చకచక అడుగులు వేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నాయకులతో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఆమె సమవేశమయ్యారు. ఈ క్రమంలో జై తెలంగాణ అంటూ షర్మిల నినదించారని నాయకులు […]