గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలక టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ప్రజలు విమర్శిస్తున్నారు. అంతటితో ఆగక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో విచ్చలవిడిగా డబ్బులు పంచారని మండిపడుతున్నారు. ప్రతి ఎన్నికలోనూ అధికార దుర్వినియోగానికి పాల్పడటం, దొంగ ఓట్లు వేయించడం, పైసలు పంపిణీ చేయడం తద్వారా ఓటింగ్ టైమ్ చివర్లో పోలింగ్ పెరగడం ఇదంతా టీఆర్ఎస్‌కి వెన్నతో పెట్టిన విద్య అని రూలింగ్ పార్టీపై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా కానీ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలుకావడం ఖాయమని చెబుతున్నారు.
“MLC ఎన్నికల్లో TRS అధికార దుర్వినియోగంతో పాటు డబ్బులు పంపిణీ చేసిందన్న విపక్షాల ఆరోపణలను నమ్ముతారా?” అనే ప్రశ్నతో రాజ్ న్యూస్ నిర్వహించిన పోల్‌లో.. తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేశారు. నలభై ఒక్క వేల మంది ఓట్లు వేశారు. వారిలో తొంభై రెండు శాతం మంది అవును అని సమాధానమిచ్చారు. ఆరు శాతం మంది కాదు అని అన్నారు. పదహారు వందల మంది పోల్‌ను లైక్ చేశారు. నూట పదిహేను మంది కామెంట్స్ పెట్టారు.
“డబ్బులు పంచడం అధికారాన్ని దుర్వినియోగం చేయడం టిఆర్ఎస్ పార్టీకి కొత్తేమీ కాదు” అని మంతెన శ్రీనివాస్ కామెంట్ చేశారు.
“మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ పెనుబల్లి మండలం. వన్ ఓట్ ఫర్ టూ దౌజండ్స్ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చారు” అని ధరమ్‌సోత్ శ్రీనివాస్ కామెంట్ పెట్టారు.
“మా దగ్గర టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచారు. ఓటుకి పదిహేను వందలు ప్లస్ టిఫిన్ ప్లస్ ఫుడ్డు” అని వెంకట్ భూక్యా కామెంట్ చేశారు.
“కేవలం తెలంగాణ రాకముందే టీఆర్ఎస్ ప్రజాదరణతో గెలిచింది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎలక్షన్‌లో అధికార దుర్వినియోగం, దొంగ ఓట్లు, పైసల్ పంపిణీ చివరి టైమ్‌లో పోలింగ్ పెరగటం ఇది టీఆర్ఎస్‌కి వెన్నతో పెట్టిన విద్య” అని పాతూరి వెంకటేష్ కామెంట్ పెట్టారు.
“టీఆర్ఎస్ పార్టీ డబ్బు ఆశ చూపించి ఓట్లు తీసుకుందామని చూసింది. ఎప్పుడైతే ఆ పార్టీ డబ్బు పంచడం స్టార్ట్ చేసిందో అప్పుడే ఆ పార్టీ పతనం స్టార్ట్ అయింది అని నా ఫీలింగ్” అని అరుణ్ శౌరి కామెంట్ చేశారు.
“డబ్బులు పంచారు. రెండు వేలు ఇవ్వమని చెప్తే కక్కుర్తి పడి కార్పొరేటర్‌లు, వార్డు మెంబర్లు వెయ్యి రూపాయలు తిని వెయ్యి రూపాయలు పంచారు. కానీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గర పైసలు బాగున్నాయి కాబట్టి ఎక్కువ పంచాడు. కేటీఆర్‌కు కూడా తెలుసు ఓడిపోతామని” అని నాగెల్లి బాల్‌రాజ్ కామెంట్ పెట్టారు.
“అధికార పార్టీ కాబట్టి డబ్బులు పంచలేదు అంటే ఎవరూ నమ్మరు” అని రాము సిహెచ్ కామెంట్ చేశారు.
“ఇది ఆరోపణ కాదు పచ్చి నిజం” అని నరేష్ అందుగుల కామెంట్ పెట్టారు.
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంచడం ఆరోపణ కాదు పచ్చి నిజం అని ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగంతో పాటుగా డబ్బులు పంచితే తెలంగాణ ప్రజలు ఎలా రెస్పాండవుతారో.. Raj News Poll అద్దం పట్టింది